Share News

కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచిన టికెట్ గొడవ

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:57 PM

టికెట్ గొడవ కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచింది. ఇటీవలే ముగిసిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఒక్క సీటు కూడా గెలవలేదు.

కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచిన టికెట్ గొడవ

ఇంటర్‌నెట్ డెస్క్: టికెట్ గొడవ కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచింది. ఇటీవలే ముగిసిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీకి జరిగిన ఎన్నికల్లో దేంట్లోనూ గెలవలేకపోయింది. మరోవైపు ఎన్ఎస్‌యూఐ రెబల్ అభ్యర్థి దీపాన్షు షోకెన్ ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో దీపాన్షు రెబల్‌గా పోటీ చేసి 13 వేలకుపైగా ఓట్లు సాధించి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వంటి మిగతా పోస్టులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలుచుకుంది.


ఫలితాలపై రాహుల్ సీరియస్..

డీయూఎస్‌యూ ఎన్నికల ఫలితాల్లో ఎన్ఎస్‌యూఐకు ఒక్క పదవి కూడా రాకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. ఫలితాలపై నివేదిక ఇవ్వాలని ఎన్ఎస్‌యూఐ ఇన్‌చార్జి కన్హయ్య కుమార్‌ను రాహుల్ ఆదేశించారు. అలాగే, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఫలితాల తర్వాత అత్యవసర భేటీకి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ, ఉపాధ్యక్ష పదవుల పోటీల్లో ఎన్ఎస్‌యూఐ మూడో స్థానంలో నిలిచింది. ఎన్ఎస్‌యూఐ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన అభ్యర్థికి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. అభ్యర్థులకు టికెట్లు కేటాయించే విషయంలో అంతర్గత విభేదాలకు పోకుండా కలిసికట్టుగా పోటీచేసి ఉంటే, ఎన్ఎస్‌యూఐ మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Also Read:

చెక్కులు దొంగిలించి రూ.46 కోట్లు డ్రా.. తోబుట్టువులపై నటి రాధ ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

'బోన్‌ మ్యారో' టెస్టింగ్‌తో అత్యాచారం కేసు వెలుగులోకి.!

Updated Date - Sep 21 , 2026 | 10:00 PM