Share News

థాయ్‌లాండ్‌లో భారతీయ పర్యాటకుల కిడ్నాప్‌

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:15 AM

ధాయ్‌లాండ్‌ పర్యటనకు వచ్చిన ముగ్గురు భారతీయు యువకులను ఓ ముఠా కిడ్నాప్‌ చేసి డబ్బు కోసం చిత్రహింసలకు గురిచేయడం వెలుగులోకి వచ్చింది. థాయ్‌ పోలీసులు సకాలంలో స్పందించి వారిని ఆదుకున్నారు.

థాయ్‌లాండ్‌లో భారతీయ పర్యాటకుల కిడ్నాప్‌

  • చిత్రహింసలు పెట్టి రూ.లక్షలు డిమాండ్‌

  • విడిపించిన థాయ్‌ పోలీసులు

బ్యాంకాక్‌, జూలై 28: ధాయ్‌లాండ్‌ పర్యటనకు వచ్చిన ముగ్గురు భారతీయు యువకులను ఓ ముఠా కిడ్నాప్‌ చేసి డబ్బు కోసం చిత్రహింసలకు గురిచేయడం వెలుగులోకి వచ్చింది. థాయ్‌ పోలీసులు సకాలంలో స్పందించి వారిని ఆదుకున్నారు. కిడ్నాప్‌ ముఠాలో భారత్‌, పాకిస్థాన్‌వాసులు ఉండడం గమనార్హం. భారత్‌కు చెందిన మోహిత్‌ (23), ఆశీష్‌ (24), హిమాంశు (20)లు ఈ దారుణ హింసకు గురయ్యారు. వారు ఈ నెల 21న సువర్ణభూమి విమానాశ్రయంలో దిగి సెంట్రల్‌ పట్టయాలోని సుఖుంవిత్‌ రోడ్‌కు వెళ్లేందుకు ఓ టూర్‌ ఆపరేటర్‌తో ట్యాక్సీని మాట్లాడారు.


ఇంతలో మోటారు సైకిల్‌పై సమీపంలోని చౌకగా లభించే హోటల్‌కు తీసుకెళ్తామని, అక్కడ టిఫిన్‌ కూడా చేయవచ్చని అతడు చెప్పాడు. ఒక్కొక్కరిని విడివిడిగా మోటారు సైకిల్‌పై వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ముఠా సభ్యులు వారి కాళ్లూ చేతులు కట్టేసి కత్తితో బెదిరించారు. కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్లు వేశారు. బంధువులకు వీడియోకాల్‌ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని హెచ్చరిచారు. భారతదేశానికి చెందిన ఒకరు, పాకిస్థాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దాదాపు వారం రోజుల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితుల బంధువులు భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు. రాయబార కార్యాలయం అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు పట్టయా సిటీ పోలీసులు వచ్చి వారిని విడిపించారు.

Updated Date - Jul 29 , 2026 | 08:15 AM