Share News

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వీడియో వైరల్..

ABN , Publish Date - May 12 , 2026 | 02:52 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, హీరో విజయ్‌కి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. 'జన నాయగన్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా విజయ్ చేసిన డ్యాన్స్ వీడియో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వీడియో వైరల్..
Thalapathy Vijay Dance Viral

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, హీరో విజయ్‌కి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. 'జన నాయగన్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా విజయ్ చేసిన డ్యాన్స్ వీడియో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. తమ అభిమాన నటుడు విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే, అనేక కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్‌కు ముందుగానే ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా జన నాయగన్ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని మలేషియాలో 2025 డిసెంబర్ 27న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ అభిమానులు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా చిరునవ్వుతో వేదిక వద్దకు వచ్చిన దళపతి.. అభిమానులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.


అనంతరం స్టేజ్‌పైకి వెళ్లి సినిమాలోని 'తలపతి కచేరీ' పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ వీడియోనే ఫ్యాన్స్ తాజాగా మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ 'ఒక శకం ముగింపు'గా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, జన నాయగన్‌నే తన చివరి సినిమా అంటూ విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. విజయ్ చివరి డ్యాన్స్ వీడియోను షేర్ చేసుకుంటూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..

దేశంలో ఇంధన కొరత లేదు.. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి

Updated Date - May 12 , 2026 | 03:11 PM