Share News

దారుణం.. టీ తాగుతున్న యువతులపై యువకుల గ్యాంగ్ దాడి..

ABN , Publish Date - May 12 , 2026 | 12:51 PM

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. టీ షాపు దగ్గర టీ తాగుతున్న యువతులపై కొంతమంది యువకులు దాడి చేశారు. వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.

దారుణం.. టీ తాగుతున్న యువతులపై యువకుల గ్యాంగ్ దాడి..
Delhi women assault case

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. టీ షాపు దగ్గర టీ తాగుతున్న యువతులపై కొంతమంది యువకులు దాడి చేశారు. వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నెహ్రూ ప్లేస్‌లోని ఓ టీ షాప్ దగ్గర ఇద్దరు యువతులు టీ తాగుతున్నారు. అటు వైపు వెళుతున్న యువకుల గ్యాంగ్ వారిని గమనించింది. గ్యాంగ్‌లోని కొందరు యువతులపై అసభ్య కామెంట్లు చేశారు.


దీంతో ఓ యువతి ఆగ్రహానికి గురై తగిన రీతిలో వారికి సమాధానం ఇచ్చింది. ఆ యువతి తమపై తిరగబడ్డం అవమానంగా భావించిన యువకులు రెచ్చిపోయారు. ఇద్దరిపై దాడికి దిగి వారి దుస్తులు చింపేశారు. చుట్టూ చాలా మంది జనం ఉన్నా ఎవ్వరూ కూడా యువతులకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. బాధిత యువతులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతులు పోలీసులతో మాట్లాడుతూ.. ‘ ఆ యువకులు మిమ్మల్ని అసభ్యకరంగా తిట్టినపుడు ఎదురు తిరిగాము. వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు. మేము అక్కడే మౌనంగా కూర్చుండిపోయాం’..


‘కొద్దిసేపటి తర్వాత ఆ యువకులు మరికొంతమందిని వెంటబెట్టుకుని వచ్చారు. మాపై దాడి చేశారు. మేము అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు వెదురు కర్రలతో కొట్టారు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. వాళ్లు చూస్తూ ఉన్నారే తప్ప మాకు సాయం చేయడానికి రాలేదు. కొంతమంది మమ్మల్ని చూసి నవ్వారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు .. త్వరలో కొత్త షెడ్యూల్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

Updated Date - May 12 , 2026 | 01:13 PM