టీజీఐఐసీకి సుప్రీంలో ఊరట
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:05 AM
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన 46 ఎకరాల రాయదుర్గం భూముల వేలం, సర్వే వివాదంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కు సుప్రీంకోర్టులో...
46 ఎకరాల భూవివాదంలో ఇంప్లీడ్ అయ్యేందుకు స్వేచ్ఛ
వారంపాటు ఆ భూములపై స్టేటస్ కో
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన 46 ఎకరాల రాయదుర్గం భూముల వేలం, సర్వే వివాదంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. తమను పార్టీగా చేర్చకుండా, తమ వాదనలు వినకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ టీజీఐఐసీ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్(ఎ్‌సఎల్‌పీ)పై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో టీజీఐఐసీకి హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యే ేస్వచ్ఛను ఇచ్చింది. వారం రోజుల పాటు సర్వేకు సంబంధించి యథాతథ స్థితి(ేస్టటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. టీజీఐఐసీ వర్సెస్ షహానా హైదర్ సహా ఇతరులు’’ పిటిషన్‌ను గురువారం విచారించిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అత్యంత ఖరీదైన వివాదాస్పద భూములకు సంబంధించి తమను కనీసం పార్టీగా చేర్చకుండానే సర్వేకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని టీజీఐఐసీ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తమ వాదనలు వినకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుల వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని తెలిపారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆస్తుల వేలం ప్రక్రియను, సర్వేను తక్షణమే నిలివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది నితీష్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2008 నాటి అసలు ఉత్తర్వులు ఇప్పటికే రద్దయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు వేసుకోకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపారు. సర్వేను లేదా వేలాన్ని నిలిపివేసేలా నేరుగా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టులోనే ఇంప్లీడ్ అయ్యి, అభ్యంతరాలు తెలియజేేసందుకు టీజీఐఐసీకి స్వేచ్ఛను ఇచ్చింది. వారం రోజుల పాటు ఆ భూములపై యథాతథ స్థితి అమలు చేయాలని ఆదేశించింది. ఇంప్లీడ్ పిటిషన్‌ను గత పరిశీలనల ప్రభావం లేకుండా స్వతంత్రంగా విచారించాలని హైకోర్టుకు సూచించింది. 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రధాన రిట్ పిటిషన్‌ను వీలైనంత వేగంగా, సాధ్యమైతే మూడు నెలల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News