సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్ర దాడి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:03 AM
జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
బైక్‌పై వచ్చి 15 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు
ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు
వారిలో ఇద్దరి పరిస్థితి విషమం
కశ్మీర్‌లోని కుల్గాంలో ఘటన
శ్రీనగర్, నవంబరు 11: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఓ ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు.. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఏకే47 తుపాకీతో 15 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలవ్వగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లా మీర్‌బజార్ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని లష్కరే తోయిబాకు చెందిన విదేశీ ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. బైక్ వచ్చి కాల్పులు జరుపుతూనే ఉగ్రవాదులు పారిపోయారని.. అప్రమత్తమైన జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన ముగ్గురు జవాన్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు, మరొకరు హెడ్ కానిస్టేబుల్ అని.. వారిని అనంతనాగ్‌లోని ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు