సంపన్న రాష్ట్రం తెలంగాణ
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:18 AM
భారత్ దిగువ మధ్యాదాయ దేశమే అయినప్పటికీ.. తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రాలని ప్రపంచబ్యాంకు వెల్లడించింది....
ప్రపంచబ్యాంకు నివేదికలో ఎగువ మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థగా చోటు
న్యూఢిల్లీ, జూలై 6: భారత్ దిగువ మధ్యాదాయ దేశమే అయినప్పటికీ.. తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రాలని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. భారత్ తలసరి ఆదాయం 2,760 డాలర్లు (రూ.2,63,179) కాగా.. తెలంగాణలో అది 5,407 డాలర్లని (రూ.5,15,583) తెలిపింది. ఎగువ మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థకు సంకేతంగా ప్రపంచబ్యాంకు 4,636 డాలర్ల తలసరి ఆదాయాన్ని సగటు ప్రమాణంగా నిర్ణయించగా.. దీనిని దేశంలో ఐదు రాష్ట్రాలు దాటాయి. వాటిలో ఢిల్లీ (6,217 డాలర్లు), కర్ణాటక (5,579 డాలర్లు), తెలంగాణ (5,407 డాలర్లు), తమిళనాడు (5,329 డాలర్లు), గుజరాత్ (4,734 డాలర్లు) ఉన్నాయి. వివిధ దేశాల ఆర్థికస్థాయిలను వెల్లడిస్తూ ప్రపంచబ్యాంకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు అధికాదాయ దేశాల (14,375 డాలర్లు) విభాగంలో చేరాయి. భారత్ దిగువ మధ్యాదాయ దేశంగా ఉంది. కాగా, దేశంలో ఎగువ మధ్యాదాయ స్థాయిని ఐదు రాష్ట్రాలు దాటగా.. ఆ శ్రేణికి దగ్గరలో మహారాష్ట్ర (4,628 డాలర్లు), హరియాణా (4,627 డాలర్లు), కేరళ (4,610 డాలర్లు) ఉన్నాయి. 984 డాలర్ల తలసరి ఆదాయంతో బిహార్ అన్ని రాష్ట్రాల్లోకి అట్టడుగున ఉండగా.. దానికంటే కాస్త మెరుగ్గా ఉత్తరప్రదేశ్ (1403 డాలర్లు), జార్ఖండ్ (1470 డాలర్లు) ఉన్నాయు. ఈ మూడు రాష్ట్రాల పరిస్థితి నేపాల్, ఆఫ్రికా దేశాలకన్నా అధ్వానంగా ఉందని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News