Share News

కోలీవుడ్‌కు బంపర్ ఆఫర్.. రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి

ABN , Publish Date - May 25 , 2026 | 08:25 PM

తమిళ చలనచిత్ర పరిశ్రమకు (కోలీవుడ్) తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్‌కు బంపర్ ఆఫర్.. రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి
Tamil Nadu Government Cinema Decision

చెన్నై, మే 25: తమిళ చలనచిత్ర పరిశ్రమకు (కోలీవుడ్) తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు అందించింది. చిత్ర నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాల అభ్యర్థనలను మన్నిస్తూ స్టాలిన్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు.. మొదటి 7 రోజుల పాటు రోజుకు 5 ప్రదర్శనలకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు థియేటర్ల నియంత్రణ నిబంధనలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.


సాధారణంగా తమిళనాడులో ప్రస్తుతం రోజుకు 4 ప్రదర్శనలకు మాత్రమే చట్టబద్ధమైన అనుమతి ఉంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ప్రత్యేక షోల కోసం నిర్మాతలు ప్రతిసారీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొందాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఈ అనుమతులు రావడం ఆలస్యమై గందరగోళం నెలకొనేది. అయితే తాజా సవరణతో మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ముందస్తు ప్రత్యేక అనుమతులు అవసరం లేకుండానే 5 షోలు ప్రదర్శించుకునే వీలు కలిగింది. ప్రభుత్వ నిర్ణయంపై కోలీవుడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఆస్తులపై నోటీసు..అభిషేక్ బెనర్జీ నివాసానికి భారీగా పోలీసులు

ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

Updated Date - May 25 , 2026 | 08:45 PM