Share News

రూ.2 కోట్ల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:07 PM

తమిళనాడులో చోరీకి గురైన రూ.2 కోట్ల కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

రూ.2 కోట్ల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

చెన్నై, జూన్18: నగరంలో శాస్త్రి నగర్ ప్రాంతంలో చోరీకి గురైన రూ.2 కోట్ల కేసును తమిళనాడు పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.97 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే , మూడు మొబైల్ ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని నగర పోలీసులు వెల్లడించారు.

ఇటీవల చెన్నైలోని శాస్త్రినగర్‌లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ ముగ్గురు నిందితులు రూ. 2 కోట్లు చోరీ చేశారు. దాంతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ సంస్థతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. అనంతరం ఈ చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


పోంజీ కుంభకోణం.. ఈడీ సోదాలు

తమిళనాడులో యూనిక్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు సంబంధించిన రూ.400 కోట్ల పోంజీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో.. చెన్నై, ఈరోడ్, కోయంబత్తూరు, కృష్ణగిరి జిల్లాల్లోని మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. సోదాల సమయంలో రెండు లగ్జరీ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి సుమారు రూ.400 కోట్లు అక్రమంగా సేకరించి.. వాటిని దారి మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.


45 ఆర్టీవో కార్యాలయాలపై అధికారులు దాడులు..

రాష్ట్రంలో పలు ఆర్టీవో కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 45 ఆర్డీవో కార్యాలయాల్లో గురువారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖలో అవినీతి, లంచాల వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు చేపట్టినట్లు డీవీఏసీ అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

Read Latest National News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 07:20 PM