Share News

కేక్‌లో బూజు.. చాక్లెట్‌లో పురుగు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆందోళనలు..

ABN , Publish Date - Oct 15 , 2026 | 09:51 AM

ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

కేక్‌లో బూజు.. చాక్లెట్‌లో పురుగు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆందోళనలు..
Swiggy Instamart

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేసిన నోయిస్ బ్రాండ్ ఉత్పత్తుల్లో ఈగలు, పురుగు, బూజు కనిపించాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు (Swiggy Instamart food safety complaints).


స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేసిన గోధుమ పిండి ప్యాకెట్‌లో ఈగలు కనిపించాయని ఒక వినియోగదారుడు ఆరోపించారు. ప్యాకెట్ తెరవకముందే అందులో ఈగలు కనిపించాయని పేర్కొంటూ, ఆ ఉత్పత్తికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నోయిస్ బ్రాండ్ ఉత్పత్తుల విషయంలో ఇలాంటి నాణ్యతా సమస్యలను గతంలోనూ ఎదుర్కొన్నట్లు ఆ వినియోగదారుడు పేర్కొన్నారు. అలాగే నోయిస్ బ్రాండ్‌కు చెందిన ఫ్రెంచ్ చాక్లెట్ రోచర్‌లో పురుగు కనిపించిందని మరో వినియోగదారుడు ఫొటోను పోస్ట్ చేశారు (Flies in Noice brand atta).


ఈ విషయాన్ని వినియోగదారుల సేవా విభాగానికి తెలియజేయగా, నగదు తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు (Swiggy food quality). అలాగే నోయిస్ బ్రాండ్‌కు చెందిన కేక్‌లో బూజు కనిపించిందని ఒక వినియోగదారుడు ఆరోపించారు. ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారైన ఉత్పత్తిగా భావించి కేక్ కొనుగోలు చేశానని, అయితే కొంత భాగం తిన్న తర్వాత అందులో బూజు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. ఈ ఘటనపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగదు తిరిగి చెల్లించినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని ఆ వినియోగదారుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..


మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 15 , 2026 | 09:54 AM