Share News

మమతా బెనర్జీకి ఘోర పరాభవం.. సొంత వార్డులోనే ఓడిపోయిన మమతా..

ABN , Publish Date - May 21 , 2026 | 05:13 PM

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టారు. అయితే, ఈసీఐ తాజా డేటా ప్రకారం మమతా తన సొంత వార్డులోనూ సువేందు చేతిలో ఓడిపోయారు.

మమతా బెనర్జీకి ఘోర పరాభవం.. సొంత వార్డులోనే ఓడిపోయిన మమతా..
West Bengal Assembly Elections 2026

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టారు. భవానీపూర్ నియోజకవర్గంలో వారిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మమతా 58,812 ఓట్లు పొందగా.. సువేందు 73,000కు పైగా ఓట్లు సాధించారు. 15,000కు పైగా మెజారిటీతో సువేందు సీఎం పీఠం ఎక్కారు. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి తాజాగా బూత్ స్థాయి డేటాను భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.


ఈ డేటా ప్రకారం భవానీపూర్ నియోజకవర్గంలోనే కాకుండా మమతాను ఆమె సొంత వార్డులోనూ సువేందు అధికారి ఓడించారు. కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో మమతా నివాసం ఉంటుండగా.. ఇది 73వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈసీఐ తాజా డేటా ప్రకారం.. ఇక్కడ సువేందు 8,932 ఓట్లు సాధించగా.. మమతా కేవలం 4,284 ఓట్లు పొందారు. అలాగే పలు వార్డుల్లోనూ ఆమె అత్యల్ప ఓటింగ్ శాతం నమోదు చేశారు. బూత్ 14లో 43 ఓట్లు, బూత్ 16లో 42 ఓట్లు, బూత్ 20లో 41 ఓట్లు, బూత్ 105లో కేవలం 31 ఓట్లు మాత్రమే మమతాకు పోలయ్యాయి. మరికొన్ని బూత్‌లలోనూ ఆమెకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఫలితాలు టీఎంసీ శ్రేణులనే కాకుండా.. రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


నియోజకవర్గ వ్యాప్తంగా 267 పోలింగ్ బూత్‌లు ఉండగా.. 207 బూత్‌లలో సువేందు అధికారి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తం ఓట్లలో ఆయనకు దాదాపు 63 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, మమతా బెనర్జీ 30 శాతానికే పరిమితమయ్యారు. కాగా, బూత్ లెవల్ గణాంకాలు తృణమూల్ కాంగ్రెస్, మమతా ఓటమి తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..

Updated Date - May 21 , 2026 | 05:28 PM