Share News

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

ABN , Publish Date - May 21 , 2026 | 02:50 PM

తమిళనాడు మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్ ప్రస్తావించడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు.

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం
S Rajesh Kumar oath

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్ ప్రస్తావించడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం చేప్పారు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్.. దివంగత కాంగ్రెస్ నేతలు కామరాజ్, రాజీవ్ గాంధీలకు జేజేలు పలికారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును కూడా ప్రస్తావించారు. కలకాలం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. పక్కనే ఉన్న గవర్నర్ ఆర్లేకర్ దీనికి నవ్వుతూనే అభ్యంతరం చెప్పారు. అది మీ ప్రమాణస్వీకారంలో భాగంగా కాదని అన్నారు. దీంతో, మంత్రి రాజేశ్ కుమార్ నవ్వుతోనూ తమ ప్రమాణాన్ని ముగించారు.


తమిళనాడులో 1967 తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమైన విషయం తెలిసిందే. టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికల్లో గెలవగా ఇద్దరికి సీఎం విజయ్ కేబినెట్‌లో చోటుదక్కింది. మేజిక్ ఫిగర్ మార్కుకు కొద్ది దూరంలో నిలిచిన టీవీకే పార్టీకి తొలుత కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. అంతకుమునుపు రాష్ట్రంలో డీఎంకేకు దాదాపు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. అయితే, డీఎంకే సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి మంత్రిపదవులు చేపట్టలేదు. ఇక నేడు మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

Updated Date - May 21 , 2026 | 02:59 PM