షాపింగ్ మాల్స్‌లో ఫుడ్ కోర్ట్‌లు ఎప్పుడూ పై అంతస్తులోనే ఎందుకుంటాయి.. మీకు తెలుసా..
ABN , Publish Date - May 21 , 2026 | 05:09 PM
మీరు తరచుగా షాపింగ్ మాల్స్‌కు వెళుతుంటారా? అయితే మీరు ఒక విషయం గమనించే ఉంటారు. దాదాపు ప్రతి మాల్‌లో కూడా ఫుడ్ కోర్ట్ పై అంతస్తులోనే ఉంటుంది. ఎందుకో ఆలోచించారా? ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ, కస్టమర్ సైకాలజీ దాగి ఉందట.
మీరు తరచుగా షాపింగ్ మాల్స్‌కు వెళుతుంటారా? అయితే మీరు ఒక విషయం గమనించే ఉంటారు. దాదాపు ప్రతి మాల్‌లో కూడా ఫుడ్ కోర్ట్ పై అంతస్తులోనే ఉంటుంది. ఎందుకో ఆలోచించారా? ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ, కస్టమర్ సైకాలజీ దాగి ఉన్నాయట. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. (Why food courts are on top floor)
మాల్‌లోకి వచ్చిన కస్టమర్లు నేరుగా ఫుడ్ కోర్ట్‌కి వెళ్లాలంటే వారు ఎస్కలేటర్లు లేదా లిఫ్ట్‌ల ద్వారా పై అంతస్తులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ప్రతి ఫ్లోర్‌లో ఉన్న దుకాణాలు, బ్రాండ్లు, ఆఫర్లు చూస్తారు. దీంతో షాపింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇదే మాల్ యాజమాన్యాల ప్రధాన లక్ష్యం. అలాగే ఫుడ్ కోర్ట్‌ను టాప్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు మాల్‌లో ఎక్కువ సమయం గడుపుతారు. ముందుగా షాపింగ్ చేసి, తరువాత భోజనం చేయాలని అనుకుంటారు. దీని వల్ల మాల్‌లో జనసంచారం కూడా ఎక్కువగా కనబడుతుంది (Mall business strategy).
ఫుడ్ కోర్ట్స్‌కు సాధారణంగా ఎక్కువ స్థలం అవసరం ఉంటుంది (Food court psychology). అలాగే ఆహార తయారీ సమయంలో వచ్చే వాసనలు, పొగ ఇతర షాపులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు కూడా ఫుడ్ కోర్ట్స్‌ను పై అంతస్తుల్లో ఏర్పాటు చేస్తారు. టాప్ ఫ్లోర్‌లో వెంటిలేషన్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఏదేమైనా, ఫుడ్ కోర్ట్స్‌ను టాప్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడం వెనుక కస్టమర్లతో ఎక్కువగా షాపింగ్ చేయించే వ్యూహం దాగి ఉంది.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..