Share News

మెట్రో మూసివేత, అరెస్టులపై పిటిషన్లు.. సుప్రీంకోర్టులో రేపు ప్రత్యేక విచారణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:51 PM

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి నిరాకరించడం, పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం, మెట్రో స్టేషన్లు మూసివేయడం వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా విచారించనుంది

మెట్రో మూసివేత, అరెస్టులపై పిటిషన్లు.. సుప్రీంకోర్టులో రేపు ప్రత్యేక విచారణ
CJP protest

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలు, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి నిరాకరించడం, పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం, మెట్రో స్టేషన్లు మూసివేయడం వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా విచారించనుంది (Supreme Court Delhi protest).


ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి.మోహనలతో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లను ఆదివారం విచారించనుంది. కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ధిక్కార చర్యలు తీసుకోవాలని ఒక పిటిషన్‌లో కోరారు. అలాగే నిరసనల సందర్భంగా రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ, వారిని విడుదల చేయాలని మరో పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు (Delhi Metro shutdown).


జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అధికారులు మూసివేశారు (CJP protests). రైలు సేవలపైనా ఆంక్షలు విధించారు. దీనివల్ల నిరసనల్లో పాల్గొనాలనుకున్న వారితో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరగనుంది. అలాగే సీజేపీ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన పలువురిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు అనుమతి నిరాకరించడం, శాంతిభద్రతల పేరుతో విధించిన ఆంక్షలు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.


ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..


ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 10 , 2026 | 09:54 PM