Share News

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యాచారాలు నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయి: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:32 PM

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. కల్కాజీ ఆలయం సమీపంలోని పార్కులో జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఘటనతో పాటు.. ఢిల్లీలో కదులుతున్న స్లీపర్‌ బస్సులో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యాచారాలు నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయి: సుప్రీంకోర్టు
Supreme Court

ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇటీవలే కల్కాజి ఆలయ సమీపంలోని పార్కులో జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనతో పాటు ఢిల్లీలోని కదులుతున్న స్లీపర్ బస్సులో ఓ బాలికపై లైంగిక దాడిని కూడా సమోటోగా తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న అత్యాచారాలపై జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడుల వార్తలు చూసి తమకు చాలా బాధగా ఉందని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. జవాబుదారీతనంతోనే అలాంటి ఘోరాలను అడ్డుకోవచ్చని బెంచ్ అభిప్రాయపడింది.


గ్రేటర్ నోయిడాలోని పరీ చౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌కు వెళుతున్న స్లీపర్ బస్సులో ఓ టీనేజీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. అలాంటి ఘోరాన్ని 2012 నాటి నిర్భయ ఘటనతో పోల్చడం తప్ప ఏమీ చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి అత్యాచార ఘటనలు.. చట్టాలను అమలుచేసే వ్యవస్థలోని వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయని పేర్కొంది. అలాగే, ప్రజలకు కనీస భద్రత కల్పించాల్సిన పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీల వైఫల్యాన్ని కూడా అత్యాచార ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయని బెంచ్ పేర్కొంది. భద్రతా వైఫల్యం వల్లే కల్కాజి ఆలయ సమీపంలోని 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ధర్మాసనం అభిప్రాయపడింది. బహిరంగ స్థలాలు నేరాలకు వేదికగా ఉండకూడదని, వాటిని అలా ఉంచలేమని సుప్రీం పేర్కొంది.


Also Read:

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 28 , 2026 | 01:32 PM