Share News

అప్పీలు విచారణకు 40 ఏళ్లా.. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:03 PM

ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై తీర్పు ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టు 40 ఏళ్లకు పైగా సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని పేర్కొంది.

అప్పీలు విచారణకు 40 ఏళ్లా.. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Supreme Court

ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై తీర్పు ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టు 40 ఏళ్లకు పైగా సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని, పేరుకుపోతున్న కేసులను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది (Allahabad High Court judicial delay).


ఉత్తర్​ప్రదేశ్‌కు చెందిన విజయ్ సింగ్ 1983 నవంబర్‌లో తన తమ్ముడి హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పుడు విజయ్ వయసు 28 సంవత్సరాలు. ట్రయల్ కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేశాడు. అయితే ఆ అప్పీలుపై తుది నిర్ణయం రావడానికి నాలుగు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడి అప్పీలును అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది (40 years appeal).


మొత్తం ఈ 43 ఏళ్ల కాలంలో విజయ్ మూడు నెలలు మాత్రమే జైలులో ఉన్నాడు. మిగిలిన సమయం అంతా తన అప్పీలుపై తీర్పు కోసం ఎదురుచూస్తూ బయటే గడిపాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ సమయంలో కూడా అతడికి బెయిల్ కొనసాగుతోంది. అప్పీలుపై విచారణ కోసం అలహాబాద్ హైకోర్టు ఏకంగా 41 ఏళ్ల సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..


యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 09 , 2026 | 07:27 PM