యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:11 PM
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్స్ సదస్సు డబ్ల్యూడబ్ల్యూడీసీ-2026 (WWDC 2026)లో ఐఓఎస్ 27 (iOS 27)ను అధికారికంగా ప్రకటించింది.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్స్ సదస్సు డబ్ల్యూడబ్ల్యూడీసీ-2026 (WWDC 2026)లో ఐఓఎస్ 27 (iOS 27)ను అధికారికంగా ప్రకటించింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, మరింత శక్తిమంతమైన సిరి ఏఐ, అలాగే మెరుగైన లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను కంపెనీ పరిచయం చేసింది. అలాగే చైల్డ్ సేఫ్టీ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది.
ప్రస్తుతం ఐఓఎస్ 27 డెవలపర్ బీటా అందుబాటులోకి వచ్చింది. డెవలపర్లు వెంటనే దీనిని పరీక్షించవచ్చు. సాధారణ వినియోగదారుల కోసం పబ్లిక్ బీటా జులై చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని యాపిల్ ప్రకటించింది. ఇక, తుది వెర్షన్ సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ సిరీస్‌తో పాటు విడుదల కానుంది. అలాగే ఐఓఎస్ 27లో యాప్‌లు మరింత వేగంగా ఓపెన్ అవడం, ఫొటోలు త్వరగా లోడ్ కావడంతో పాటు సిస్టమ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది (iOS 27 release date).
ఈ కొత్త ఐఓఎస్ 27 అప్‌డేట్ ఐఫోన్ 11, ఆ తర్వాత మోడళ్లకు మాత్రమే వస్తుంది (iOS 27 supported iPhones). ఎస్ఈ 2020, 2022 మోడళ్లకు కూడా ఐఓఎస్ 27 అప్‌డేట్ వస్తుంది. అయితే కొత్త ఏఐ ఫీచర్లు మాత్రం ఐఫోన్ 17, ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్