Share News

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:47 PM

దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ 20 సంవత్సరాలుగా ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..
Driving licence validity

దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ 20 సంవత్సరాలుగా ఉంది. ఆ వ్యాలిడిటీని 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం (Driving licence validity).


ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, వాహనదారులు తరచుగా లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆర్‌టీవో కార్యాలయాలపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు కూడా ఆదా కానుంది. ఇక, వాహన యాజమాన్య బదిలీ, పర్మిట్ పునరుద్ధరణ, ఇతర రవాణా సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి (DL validity 50 years).


రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు, ఇతర భాగస్వాములతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది (RTO reforms). కాగా, ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఎటువంటి కాలపరిమితినీ ప్రకటించలేదు. అలాగే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్

Updated Date - Jun 09 , 2026 | 03:05 PM