Share News

టెట్రా ప్యాక్‌, సాచెట్లలో మద్యం అమ్మకాలా..?

ABN , Publish Date - May 21 , 2026 | 05:34 AM

టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల(చిన్న ప్యాకెట్‌)లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని...

టెట్రా ప్యాక్‌, సాచెట్లలో మద్యం అమ్మకాలా..?

  • ఇది మోసపూరితం.. కేంద్రం వివరణ ఇవ్వాలి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, మే 20: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల(చిన్న ప్యాకెట్‌)లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు వాటిల్లో మద్యాన్ని అమ్మడమనేది మోసపూరిత చర్యగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. కమ్యూనిటీ ఎగైనెస్ట్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌ (సీఏడీడీ) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం పంచోలీల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్‌ పాలసీలో ‘బాటిల్‌’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని.. పండ్ల రసాలను పోలిన పేర్లు, బొమ్మల(ఆపిల్‌, మామిడి)తో లోపల వోడ్కా, మద్యాన్ని ప్యాక్‌ చేయడం ద్వారా వినియోగదారులు, ముఖ్యంగా మైనర్లు తప్పుదోవ పట్టే అవకాశముందని పిటిషన్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ ప్యాకెట్లు చిన్నవిగా ఉండటం వల్ల ప్రజలు తిరిగే ప్రదేశాలు, వాహనాల్లో ప్రయాణిస్తూ సులభంగా సేవించే అవకాశముందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, ఇతర ప్రతివాదులకు నోటీసులను జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:34 AM