పదేళ్లు నిద్రలో ఉన్నారా!
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:02 AM
సీనియారిటీ జాబితాను కాదని తన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి పదోన్నతి ఇస్తే దశాబ్దకాలంగా ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2002లో ప్రమోషన్ వస్తే, 2011 వరకూ న్యాయపోరాటం ఎందుకు ప్రారంభించలేదని నిలదీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ జి.సురేందర్ రెడ్డి, సీవీ లక్ష్మి తహసీల్దార్ క్యాడర్‌లో పనిచేశారు.
2002లో ప్రమోషన్ వస్తే.. 2011 వరకూ ఏం చేశారు?: సుప్రీం
ఏపీ అధికారి స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): సీనియారిటీ జాబితాను కాదని తన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి పదోన్నతి ఇస్తే దశాబ్దకాలంగా ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2002లో ప్రమోషన్ వస్తే, 2011 వరకూ న్యాయపోరాటం ఎందుకు ప్రారంభించలేదని నిలదీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ జి.సురేందర్ రెడ్డి, సీవీ లక్ష్మి తహసీల్దార్ క్యాడర్‌లో పనిచేశారు. సీనియారిటీ జాబితాలో సురేందర్ రెడ్డి 72వ స్థానంలో , లక్ష్మి 108వ స్థానంలో ఉన్నారు. 2002లో లక్ష్మికి డిప్యూటీ కలెక్టర్ హోదాతో సమానమైన పదోన్నతి లభించింది. దీనిపై సురేందర్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. 2011లో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (ఏపీఏటీ)ను ఆయన ఆశ్రయించారు. అయితే, తదుపరి ప్రమోషన్ పొందడానికి ఫీడర్ క్యాడర్‌లో కనీసం మూడేళ్ల సర్వీస్ ఉండాలనే నిబంధన ఆయనకు వర్తించకపోవడంతో, ఆ ట్రైబ్యునల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ట్రైబ్యునల్ తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా, అక్కడా నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పును సురేందర్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 20న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ వార్తలనూ చదవండి..
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి