Share News

ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అమలుకు ప్రత్యేక వ్యవస్థ : సుప్రీం కోర్టు

ABN , Publish Date - May 21 , 2026 | 05:25 AM

ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకు భూములను తీసుకొని ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం...

ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అమలుకు ప్రత్యేక వ్యవస్థ : సుప్రీం కోర్టు

  • ప్రభుత్వ రాయితీలు పొందిన ఆస్పత్రులు నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి

న్యూఢిల్లీ, మే 20: ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకు భూములను తీసుకొని ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చేసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు, భూకేటాయింపు సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలతో మే 23న ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్‌ రోగులకు 10ు ఇన్‌పేషెంట్‌, 25 ఓపీడీ సేవలు అందించాలనే నిబంధనలను ప్రైవేటు ఆస్పత్రులు పాటించడంలేదని పేర్కొంది. మొత్తం 51 ఆస్పత్రులకు నోటీసులివ్వగా కేవలం 4 ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నట్టు అఫిడవిట్ల ద్వారా తెలిసిందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకు భూములు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు పేదలకు ఉచిత వైద్యం అందించాలనే నిబంధన కచ్చితంగా అమలు కావాలంటే ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:25 AM