త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ABN , Publish Date - May 28 , 2026 | 05:09 AM
ఈ విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తామని సీబీఎ్‌సఈ ప్రకటించిన త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ...
న్యూఢిల్లీ, మే 27: ఈ విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తామని సీబీఎ్‌సఈ ప్రకటించిన త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాక, త్రిభాషా విధానం అమలుపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం, సీబీఎ్‌సఈ, ఎన్‌సీఈఆర్‌టీకి నోటీసులు జారీ చేసింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు రెండు భారతీయ, ఓ విదేశీ భాష సహా మొత్తం మూడు భాషలు తప్పనిసరిగా అభ్యసించాలని సీబీఎ్‌సఈ ఇటీవల నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ వేర్వేరు వ్యక్తులు దాఖలుచేసిన పిటిషన్లు.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ముందుకు బుధవారం వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News