Share News

సెప్టెంబర్‌ 5న CJP ఇండియా గేట్ మార్చ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:10 PM

సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో జరగనున్న CJP ఇండియా గేట్ మార్చ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్న ధర్మాసనం.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.

సెప్టెంబర్‌ 5న CJP ఇండియా గేట్ మార్చ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court CJP March

ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో నిర్వహించనున్న CJP ఇండియా గేట్ మార్చ్‌ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ఢిల్లీకి రానున్నారని, ఈ సమయంలో మార్చ్‌లు నిర్వహించడం వల్ల నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


అయితే, ముందస్తు ఊహాగానాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ కమిటీ ఎదుట ఉంచాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 10కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడుతున్నాయా? ఇది తెలుసుకోండి

గాయాలకు పసుపు పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Updated Date - Aug 31 , 2026 | 02:10 PM