సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు.. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్..
ABN , Publish Date - May 29 , 2026 | 11:47 AM
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్ పెట్టింది. తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసింది.
న్యూఢిల్లీ, మే 29: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్ పెట్టింది. తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసింది. వాదనలు ముగిశాక 3 నెలల లోపే తీర్పు వెలువరించాలని స్పష్టం చేసింది. జడ్జీలు నిబంధనలు పాటించకపోతే ఆ కేసులను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. హైకోర్టుల్లో కేసుల జాప్యం, తీర్పుల ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసు విచారణ పూర్తయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన 3 నెలల లోపు కచ్చితంగా తీర్పు చెప్పాలని తేల్చి చెప్పింది. బెయిల్ ఉత్తర్వులను వీలైనంత వరకు మరుసటి రోజే ప్రకటించాలని, అదే రోజు జైలు అధికారులకు పంపాలని ఆదేశించింది. బెయిల్ వచ్చిన అండర్ ట్రయల్ ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని తెలిపింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీని హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది.
కోర్టులో ముఖ్యాంశం (Operative part) ప్రకటించిన 7 రోజుల్లోగా పూర్తి కారణాలతో కూడిన తీర్పును అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా తీర్పు కారణాలను వెబ్‌సైట్‌లో పెట్టకపోతే.. ఆ కేసును వేరే కొత్త బెంచ్‌కు బదిలీ చేయవచ్చని తెలిపింది. ఈ ఉత్తర్వులను అన్ని హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూర్తుల ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు