పేదలకు ఉచిత వైద్యం.. విధివిధానాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం..
ABN , Publish Date - May 20 , 2026 | 06:48 PM
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఉచిత చికిత్స అందించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఉచిత చికిత్స అందించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఉచితంగా భూములు లేదా ఇతర రాయితీలు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు, తమ వద్దకు వచ్చే బలహీన వర్గాల రోగులకు నిర్దిష్ట శాతం ఉచిత చికిత్స అందించాలని గుర్తుచేసింది (Supreme Court Delhi government).
ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం అందించే విధానాన్ని సమర్థంగా అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అర్హులైన పేద రోగులను ఎలా గుర్తించాలి, ఆస్పత్రులు ఎంత శాతం పడకలను కేటాయించాలి, చికిత్సను ఎలా పర్యవేక్షించాలి వంటి అంశాలపై సమగ్ర విధివిధానాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది (Free treatment poor patients).
51 ప్రైవేట్ ఆస్పత్రులకు గతంలో కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చామని, ఆ 51లో కేవలం 4 ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది (Weaker sections healthcare). ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత చికిత్స అందించడం లేదని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం త్వరలో కొత్త గైడ్‌లైన్స్ రూపొందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..