Share News

విద్యార్థుల అసహనంపై సుప్రీం ఆందోళన

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:52 AM

సీబీఎస్ఈ డిజిటల్‌ మూల్యాంకన విధానంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంపై...

విద్యార్థుల అసహనంపై సుప్రీం ఆందోళన

  • సీబీఎ్‌సఈ డిజిటల్‌ మూల్యాంకనంపై దాఖలైన పిల్‌

విచారణలో సొలిసిటర్‌ జనరల్‌ సహకరించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 15: సీబీఎస్ఈ డిజిటల్‌ మూల్యాంకన విధానంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం)’ విధానంలో జవాబు పత్రాల డిజిటల్‌ మూల్యాంకనానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్‌ విచారణలో సహకరించాలని సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ) తుషార్‌ మెహతాను కోరింది. డిజిటల్‌ మూల్యాంకన విధానంలో వ్యవస్థాగతమైన సమస్యలు క్రమంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. ఓఎస్ఎంకు సంబంధించి సీబీఎస్ఈ, కేంద్రం తీసుకుంటున్న చర్యలపై స్థాయీ నివేదిక సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 05:52 AM