అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ.. అనితా దీప్కే ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Jul 30 , 2026 | 10:48 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు, తమ కుమారుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని తల్లి అనితా దీప్కే తెలిపారు. సీజేపీ నిరసనలతో అభిజీత్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పలువురు తల్లిదండ్రులు తమను కలుస్తున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు, తమ కుమారుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని తల్లి అనితా దీప్కే తెలిపారు. సీజేపీ నిరసనలతో అభిజీత్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పలువురు తల్లిదండ్రులు తమను కలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమ అమ్మాయికి అభిజీత్‌తో వివాహం జరిపించాలని ఇప్పటికే చాలా మంది కోరినట్లు అనితా దీప్కే వెల్లడించారు.
అభిజీత్ విదేశాల్లో ఉన్నప్పుడు వివాహ అంశాన్ని పలుమార్లు ప్రస్తావనకు తెచ్చామని, ఆ విషయం గురించి మాట్లాడిన ప్రతిసారీ చిరునవ్వుతో తిరస్కరించేవాడని తెలిపారు. చదువు పూర్తి చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడని ఆమె వివరించారు. జనవరి 2027 నాటికి మాత్రం తాము వివాహం చేయాలని ఆశిస్తున్నట్లు అనిత చెప్పారు. అయితే, వివాహం, అమ్మాయి ఎంపిక విషయంలో తమ కుమారుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకొచ్చారు. అభిజీత్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ కుటుంబం మొత్తం అతనికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. తమ కుమారుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా సీజేపీ ఏర్పాటు చేయడానికి గల అసలు కారణాన్ని అభిజీత్ తల్లి అనిత వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా చాలా మంది విద్యార్థులు నష్టపోయారని, అలాగే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాధిత కుటుంబం అభిజీత్‌కు తమ బాధను చెప్పుకుని, సమస్యపై పోరాడాలని కోరిందన్నారు. దీంతో విద్యార్థులకు న్యాయం జరిగేలా అభిజీత్ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు అనితా దీప్కే తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాంకీపూర్ ఉపఎన్నికకు ముందు హైడ్రామా.. పోలీసులపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆరోపణలు..
అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..