భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్‌ను మహిళలు ఎన్నటికీ క్షమించరు: మోదీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:03 PM
మహిళా రిజర్వేషన్ కలలను సాకారం చేసి, చరిత్రను లిఖించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్‌ను, భాగస్వామ్య పార్టీలను మహిళలు ఒక్కనాటికీ క్షమించరని అన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ కలలను సాకారం చేసి, చరిత్రను లిఖించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్‌ను, భాగస్వామ్య పార్టీలను మహిళలు ఒక్కనాటికీ క్షమించరని అన్నారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లు తాము సాధించలేకపోయినప్పటికీ దేశంలోని 100 శాతం మహిళా శక్తి తమవెంటే ఉందనే విషయం తనకు తెలుసునని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన అనంతరం ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం రాత్రి ప్రసంగించారు.
ప్రసంగంలో ముఖ్యాంశాలు..
-మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు విభేదించడం నన్ను ఎంతో బాధించింది.
-మహిళా హక్కులపై జరిగిన దాడిని ప్రతి మహిళ గుర్తుపెట్టుకుంటారు
-తమ హక్కులపై దాడి జరిగిన విషయం దేశ మహిళందరికీ తెలుసు.
-మహిళల ఆగ్రహం నుంచి విపక్షాలు తప్పించుకోలేవు.
-కేంద్రం తెచ్చిన బిల్లు ఎవరి హక్కులనీ ఊడలాక్కోదు, బిల్లులతో అందరికీ మేలు జరుగుతుంది.
-మహిళలకు సాధికారత కల్పించే కల్పించే బిల్లు ఇది.
-ఈ బిల్లు స్వచ్ఛమైన, నిజాయితీతో చేసిన ప్రయత్నం.
-అయితే మహిళా హక్కులను విపక్షాలు కొల్లగొట్టాయి సంబరాలు చేసుకున్నాయి
- బిల్లుతో అన్ని రాష్ట్రాల వాణి మరింత బలపడుతుంది.
-కేంద్రం నిజాయితీతో చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్, భాగస్వామ్య పక్షలు హత్య చేశాయి
-కాంగ్రెస్ తన భాగస్వాములను పరాన్నజీవులుగా మార్చింది.
- మహిళల ఆత్మగౌరవం గాయపడింది.
- భారత మహిళల ప్రతిభను అడ్డుకున్నారు. వారి చిరకాల స్వప్నాన్ని చిదిమేశారు.
- ప్రాంతీయ భేదాలు లేకుండా మహిళలకు మేలు చేయాలని మేము సంకల్పించాం.
- మహిళలకు కొత్త దశ, దిశ చూపించాలనుకున్నాం.
- కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ భ్రూణహత్యకు పాల్పడ్డాయి. రాజ్యాంగాన్ని అవమానించాయి.
- ప్రతిసారి రిజర్వేషన్లను అడ్డుకుంటూ పాపం చేసిన వారికి మహిళలే శిక్ష వేస్తారు.
-ఏదిఏమైనా మహిళా రిజర్వేషన్లకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇవి కూడా చదవండి..
మహిళల కలలను చిదిమేశారు: విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు!
చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు: మోదీ