Share News

చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు: మోదీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:48 PM

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కోయంబత్తూర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మహిళల కోసం చేసిన మంచి ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు: మోదీ
Narendra Modi Coimbatore rally

చెన్నై, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కోయంబత్తూర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మహిళల కోసం చేసిన మంచి ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళల అభ్యున్నతి కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకున్నందుకు డీఎమ్‌కే నేతలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. సామాన్య మహిళలను ఎంపీ, ఎమ్మెల్యేలను చేయడమే తన సంకల్పమన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు క్రెడిట్‌ను విపక్షాలే తీసుకోవాలని కోరానని చెప్పారు.


మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ .. ‘మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాం. కాంగ్రెస్‌, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయి. డీఎమ్‌కే నేతల చీకటి పనులు ప్రజలకు తెలుసు. నా బాధను పంచుకోవడానికే ఇక్కడికి వచ్చా. రిజర్వేషన్ల కోసం మా పోరాటం ముగియలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం దారుణం. ఈ నెల 23న కాంగ్రెస్‌, డీఎమ్‌కే నేతలకు ఓటు ద్వారా సమాధానం చెప్పాలి’ అని తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు.


కేంద్ర కేబినెట్ భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం కేంద్ర కేబినేట్‌తో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ.. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని అన్నారు. మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు శిక్ష అనుభవిస్తాయని అన్నారు.


ఇవి కూడా చదవండి

కేఎల్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం

Updated Date - Apr 18 , 2026 | 07:51 PM