ఇంధనం పొదుపు చర్యలపై సుప్రీం కీలక నిర్ణయం.. వారంలో రెండుసార్లు విచారణ
ABN , Publish Date - May 15 , 2026 | 05:42 PM
ప్రస్తుత పెట్రోలియం సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది
న్యూఢిల్లీ: ప్రస్తుత పెట్రోలియం సంక్షోభాన్ని (petroleum crisis) దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది.
అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం ప్రకారం, ప్రతి సోమవారం, శుక్రవారాల్లో సుప్రీంకోర్టులో వర్చువల్ విచారణ జరుగనుంది. తక్కిన మూడు పనిదినాల్లో హైబ్రిడ్ మోడల్ (ముఖాముఖీ తరహా)లో విచారణ చేపడుతుంది.
ప్రస్తుత ఇంధన సంక్షోభ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సీజేఐ సూర్యకాంత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ కోర్టు ప్రొసీండింగ్స్‌ను ఫిజికల్ అప్పియరెన్స్, వర్చువల్ తరహాలో సుప్రీంకోర్టు నిర్వహిస్తోంది. ప్రధాన నరేంద్ర మోదీ ఇటీవల జాతీ ప్రయోజనాల దృష్ట్యా వర్క్ ఫ్రం హోం చర్యలు, ఇంధన పొదుపు చర్యలకు సంబంధించిన తగిన సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్