Share News

రూ.25,530 కోట్లతో సార్థక్‌-పీడీఎస్‌

ABN , Publish Date - May 28 , 2026 | 05:24 AM

దేశంలోని 81.35 కోట్ల మందికి చవకగా ఆహారధాన్యాలు అందిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)ను ఆధునికీకరించే దిశగా కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు ప్రస్తుతం...

రూ.25,530 కోట్లతో సార్థక్‌-పీడీఎస్‌

  • రేషన్‌ ఆహార ధాన్యాల తరలింపు భారం ఇక కేంద్రానిదే

న్యూఢిల్లీ, మే 27: దేశంలోని 81.35 కోట్ల మందికి చవకగా ఆహారధాన్యాలు అందిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)ను ఆధునికీకరించే దిశగా కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు పథకాలు.. ‘ఆహారధాన్యాల పంపిణీలో ప్రభుత్వ సంస్థలకు సహకారం, రేషన్‌షాపు డీలర్ల మార్జిన్‌’ (ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ), ‘ప్రజాపంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, సంస్కరణలు’ (స్మార్ట్‌ పీడీఎ్‌స)లను కలిపి సార్థక్‌-పీడీఎ్‌సగా రూపొందించింది. దీనిని రూ.25,530 కోట్ల నిధులతో 2031 వరకూ ఐదేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ వివరాల్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ విలేకర్లకు వెల్లడిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక, ఆహారధాన్యాల పంపిణీ, రవాణా దూరాభారం తగ్గింపునకు చర్యలు వంటివన్నీ వచ్చే ఐదేళ్లపాటు సార్థక్‌-పీడీఎస్‌ కిందనే అమలవుతాయని తెలిపారు. రాష్ట్రాల్లో రేషన్‌షాపులకు ఆహారధాన్యాలను తరలించటానికి అవసరమవుతున్న రవాణా వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో.. ఇకపై ఈ వ్యయాన్ని సార్థక్‌-పీడీఎస్‌ భరించనుందని వెల్లడించారు. రేషన్‌షాపు డీలర్ల కమిషన్‌ను కూడా పెంచుతామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:24 AM