మీ ఫోన్‌లో సైరన్ మ్రోగిందా? ఆందోళన వద్దు.. అది కేంద్రం పంపిన 'సాచేట్' అలెర్ట్!
ABN , Publish Date - May 02 , 2026 | 12:22 PM
దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్‌లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. అయితే ఇది, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి నిర్వహించిన టెస్ట్ డ్రైవ్.
ఢిల్లీ, మే 2: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్న సమయంలో మొబైల్ ఫోన్లలో ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది. అయితే, ఇది ఏదైనా ప్రమాద సంకేతం కాదు.. భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 'సాచేట్' (SACHET) వ్యవస్థ పనితీరు పరీక్ష.
భవిష్యత్తులో భూకంపాలు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అతి తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి కేంద్రం ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సంయుక్తంగా ఈ 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్'ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ ద్వారా పంపే సందేశం ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా సరే అలెర్ట్ ఇస్తుంది. దీనివల్ల నిద్రలో ఉన్నవారు లేదా ఫోన్ పక్కన పెట్టిన వారు కూడా తక్షణమే అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: