Share News

భారత్ సమస్యను అమెరికా అర్థం చేసుకోవాలి: విదేశాంగ మంత్రి..

ABN , Publish Date - Sep 29 , 2026 | 02:49 PM

భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్రవాద అంశం అత్యంత కీలకమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.

భారత్ సమస్యను అమెరికా అర్థం చేసుకోవాలి: విదేశాంగ మంత్రి..
S Jaishankar

ఇంటర్నెట్ డెస్క్: భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్రవాద అంశం అత్యంత కీలకమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై తమ ఆందోళనలను అమెరికా తగినంతగా అర్థం చేసుకోకపోతే.. అది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 29న న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఉగ్రవాద నిర్మూలన ఒకటని, దశాబ్దాలుగా పొరుగు దేశం నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఎదుర్కొంటున్న ఈ సమస్యను భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకోవడం, దాని తీవ్రతను గుర్తించడం అవసరమని చెప్పారు. 'భారత్‌కు ఎంతో ముఖ్యమైన అంశంపై భాగస్వామి దేశం తగినంత అవగాహన లేదా సానుభూతి చూపకపోతే.. అది సంబంధాలపై ప్రభావం చూపుతుంది' అని జైశంకర్ అన్నారు (India US relations).


భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, వ్యూహాత్మక సహకారం వంటి అనేక అంశాల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి (India Pakistan terrorism). అదే సమయంలో ఉగ్రవాదంపై కూడా రెండు దేశాల మధ్య సహకారం ఉంది. 2026 మేలో జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చల సందర్భంగా రెండు దేశాలు ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' వైఖరిని కలిగి ఉన్నాయని, సంబంధిత సంస్థల మధ్య సహకారం బలంగా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు ఉగ్రవాదం విషయంలో అమెరికా నుంచి మరింత అవగాహన అవసరమని జైశంకర్ తాజాగా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా

Updated Date - Sep 29 , 2026 | 02:49 PM