ఎబోలా వైరస్ స్ట్రెయిన్‌కు రష్యా టీకా!
ABN , Publish Date - May 28 , 2026 | 05:39 AM
ఎబోలా వైర్‌సలో కొత్త రకం స్ట్రెయిన్ అయిన ‘బుందిబుగ్యో’ను కట్టడి చేసేందుకు కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యా...
న్యూఢిల్లీ, మే 27: ఎబోలా వైర్‌సలో కొత్త రకం స్ట్రెయిన్ అయిన ‘బుందిబుగ్యో’ను కట్టడి చేసేందుకు కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు. ఈ విషయాన్ని సౌత్ ఆఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. కాంగోలో వ్యాపిస్తున్న బుందిబుగ్యో స్ట్రెయిన్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పించగలదని రష్యా తెలిపింది. బుందిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా కాంగోలో ఇప్పటివరకు 220 మంది మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. దీన్ని ప్రజారోగ్య పరంగా తీవ్ర ఆందోళన కలిగించే అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇప్పటిదాకా బుందిబుగ్యో వైర్‌సను నిరోధించేందుకు ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఈ క్రమంలో రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఎంతో కీలకంగా భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News