Share News

జైలులో నటుడు దర్శన్ ఆత్మహత్యాయత్నంపై వదంతులు.. తీవ్ర ఉద్రిక్తత

ABN , Publish Date - May 18 , 2026 | 06:35 PM

కన్నడ చలనచిత్ర నటుడు, ఓ హత్యకేసులో నిందితుడైన దర్శన్ తూగుదీప బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వదంతులు రావడం సోమవారంనాడు తీవ్ర సంచలనమైంది.

జైలులో నటుడు దర్శన్ ఆత్మహత్యాయత్నంపై వదంతులు.. తీవ్ర ఉద్రిక్తత
Kannada Actor Darshan

బెంగళూరు: కన్నడ చలనచిత్ర నటుడు, ఓ హత్యకేసులో నిందితుడైన దర్శన్ తూగుదీప (Darshan Thoogudeepa) బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వదంతులు రావడం సోమవారంనాడు తీవ్ర సంచలనమైంది. దీంతో జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తత తలెత్తింది. నిజానిజాలను నిర్ధారించేందుకు జైలు సీనియర్ తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం ఈ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించారు.


ఆదివారం రాత్రి నుంచే ఈ వదంతలు వ్యాప్తి చెందాయని, దీంతో జైలు ల్యాండ్ లైన్‌కు వరుస ఫోన్లు వచ్చాయని జైలు సిబ్బంది తెలిపారు. అయితే అలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదని సీనియర్ జైలు అధికారులు ధ్రువీకరించారు. దీనిపై జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ, సినీ నటుడు దర్శన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వచ్చిన వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రావద్దని, దర్శన్ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.


పెళ్లిరోజు..

మరోవైపు, మంగళవారంనాడు తన పెళ్లిరోజు అయినందున కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును దర్శన్ కోరారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. నటి పవిత్రాగౌడ్‌కు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే యువకుడిని హత్య చేశారనే ఆరోపణలను దర్శన్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 18 , 2026 | 07:08 PM