Share News

RTC Bus: టాయిలెట్ కోసం బస్సు ఆపిన డ్రైవర్.. ప్రయాణికులు ఏం చేశారంటే..

ABN , Publish Date - Jan 01 , 2026 | 03:58 PM

బస్సులో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు.. టాయిలెట్ కోసమో, టీ కోసమో బస్సును మార్గం మధ్యలో ఏదో ఒక హోటల్ వద్ద ఆపుతారు. అలా ఆపిన సమయంలోనే ప్రయాణికులు కూడా బస్సు దిగి..

RTC Bus: టాయిలెట్ కోసం బస్సు ఆపిన డ్రైవర్.. ప్రయాణికులు ఏం చేశారంటే..
Viral Bus News

ఇంటర్నెట్ డెస్క్: బస్సులో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు.. టాయిలెట్ కోసమో, టీ కోసమో బస్సును మార్గం మధ్యలో ఏదో ఒక హోటల్ వద్ద ఆపుతారు. అలా ఆపిన సమయంలోనే ప్రయాణికులు కూడా బస్సు దిగి.. తమ అవసరాలు తీర్చుకుంటారు. అయితే, ఇక్కడ మాత్రం డ్రైవర్ బస్సు ఆపడం పెద్ద తప్పైంది. డ్రైవర్ బస్సు ఆపడం వలన చిన్నపాటి యుద్ధమే చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులంతా రెండు వర్గాలుగా మారి.. ఘర్షణకు దిగారు. మరి ఆ తరువాత ఏం జరిగింది..? డ్రైవర్ ఏం చేశాడు..? గొడవ సద్దుమణిగిందా? ఇంకా పెద్దదైందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..


ఈ ఘటన అంతా కేరళలలో చోటు చేసుకుంది. ఎరుమేలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. తిరువనంతపురం నుంచి ముందకాయం వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు పతనంతిట్ట డిపోకు చేరుకోగా.. డ్రైవర్ కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఆ తరువాత బస్సు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొందరు ప్రయాణికులు వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తామంటూ కండక్టర్‌కి చెప్పి వెళ్లారు. అలా వెళ్లిన వారు చాలా సమయంపాటు రాలేదు. వారి కోసం బస్సు డ్రైవర్ చాలా సమయం వేచి ఉన్నాడు. ఈ క్రమంలో కొందరు హోటల్‌లో టిఫిన్స్ చేస్తున్నారని, మరికొందరు టీ తాగుతున్నారని సమాచారం అందింది. దీంతో చాలా సమయంపాటు బస్సులో వేచి ఉన్న ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు.


బస్సులో కూర్చొన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాము వేచి ఉండలేమని.. బస్సును స్టార్ట్ చేయాలని డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. కాసేపటి తరువాత బయటికి వెళ్లిన కొందరు ప్రయాణికులు తిరిగి వచ్చారు. అయితే, అప్పటికే వారి సీట్లలో వేరేవారు కూర్చున్నారు. దీంతో వారికి, వీరికి మధ్య వాగ్వాదం మొదలైంది. తాము సీట్ల నుంచి లేవమని తేల్చి చెప్పారు. దీంతో ఘర్షణ మరింత పెరిగింది. కండక్టర్ కల్పించుకుని వారందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో డ్రైవర్ నేరుగా బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆపాడు.


ఘర్షణ గురించి తెలుసుకున్న పోలీసులు.. బస్సు వద్దకు వచ్చి ప్రయాణికులతో చర్చించారు. సమస్య ఏంటో తెలుసుకుని వారందరికీ సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు తమ స్టైలో చెప్పడంతో ప్రయాణికులందరూ గమ్మున బస్సు ఎక్కి వెళ్లారు.


Also Read:

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

MP Raghunandan Rao: ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

New Year 2026 Vastu Tips: న్యూ ఇయర్ 2026.. ఈ 4 పనులు చేయకండి..

Updated Date - Jan 01 , 2026 | 04:27 PM