Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jan 01 , 2026 | 03:42 PM
ఎఫ్‌ఎమ్‌సీజీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం సూచీలపై ఒత్తిడి పెంచింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో టెలికాం సెక్టార్ లాభాలను ఆర్జించింది. అలాగే డాలర్‌లో పోల్చుకుంటే రూపాయి నష్టపోవడం కూడా సూచీలను వెనక్కి లాగింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి.
నూతన సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం ఒడిదుడుకులకు గురయ్యాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎమ్‌సీజీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం సూచీలపై ఒత్తిడి పెంచింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో టెలికాం సెక్టార్ లాభాలను ఆర్జించింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి నష్టపోవడం కూడా సూచీలను వెనక్కి లాగింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 220)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ రోజుంతా అదే ధోరణిని కనబరిచింది. గురువారం సెన్సెక్స్ 85, 101-85, 451 శ్రేణి మధ్యలో కదలాడింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలు తప్పలేదు. చివరకు సెన్సెక్స్ 32 పాయింట్ల నష్టంతో 85, 188 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలను ఆర్జించింది. చివరకు 16 పాయింట్ల లాభంతో 26, 146 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, ఏపీఎల్ అపోలో, సుప్రీమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐటీసీ, యునైటెడ్ స్పిరిట్స్, అవెన్యూ సూపర్ మార్కెట్, కేన్స్ టెక్నాలజీస్, మాన్‌కైండ్ ఫార్మా మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 265 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.96గా ఉంది.
ఇవి కూడా చదవండి
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే డయాబెటిస్ రిస్క్ ..!
ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం