Share News

రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీకి షాకిచ్చిన ముంబై ఐటీ అధికారులు

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:44 PM

బాలీవుడ్ ప్రముఖులకు ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ, సినీ నిర్మాత వాషు భగ్నానీ సహా పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీకి షాకిచ్చిన ముంబై ఐటీ అధికారులు
Rakul Preet Singh

మహారాష్ట్ర: బాలీవుడ్ ప్రముఖులకు ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ఆమె మామ, సినీ నిర్మాత వాషు భగ్నానీ సహా పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే నెపంతో వాటిని విదేశాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు.

ఈ మేరకు ఏకకాలంలో ముంబైలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు పలు బృందాలుగా ఏర్పడి సంబంధిత పత్రాలు, ఆర్థిక రికార్డులు, విదేశాలకు జరిగినట్లు అనుమానిస్తున్న లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. కాగా, బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


ఇదిలా ఉండగా.. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ గతేడాదీ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. 2025 డిసెంబర్ 19న ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు. వారి నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఇద్దరు నిందితుల నుంచి అమన్ ప్రీత్ సింగ్ ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానించారు. ఈ కేసులో అతడి కోసం ముంబై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం అప్పట్లో సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇలాంటి ప్రభుత్వానికా నేను మద్దతు ఇచ్చింది: చిరాగ్

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..

Updated Date - Sep 28 , 2026 | 04:09 PM