Share News

రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు..

ABN , Publish Date - May 21 , 2026 | 06:07 AM

దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో రైళ్లలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉండొచ్చని రైల్వే శాఖ అనుమానిస్తోంది. అగ్నిప్రమాద ఘటనలపై...

రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు..

అసాంఘిక శక్తుల పనే!

దర్యాప్తుల్లో ఆధారాలు లభిస్తున్నాయన్న రైల్వే

న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో రైళ్లలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉండొచ్చని రైల్వే శాఖ అనుమానిస్తోంది. అగ్నిప్రమాద ఘటనలపై అంతర్గతంగా నిర్వహిస్తున్న దర్యాప్తులో దీనికి బలాన్నిచ్చే ఆధారాలు లభించాయని పేర్కొంది. ప్రధానంగా నాలుగు ప్రమాద ఘటనలను రైల్వే శాఖ ప్రస్తావించింది. రాజస్థాన్‌లోని అమరపుర రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ రైలులో దుండగుడు ఉద్దేశ్యపూర్వకంగానే దిండుకు నిప్పు పెట్టడం ద్వారా అగ్నిప్రమాదానికి కారకుడయ్యాడని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో హౌరాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన దర్యాప్తులో.. ఆ రైలులోని ఓ బోగీలో బాత్‌రూమ్‌లో పెట్రోల్‌తో తడిపిన గుడ్డ ముక్క దొరికిందని, రాజస్థాన్‌లోని కోటాలో రాజధాని ఎక్స్‌ప్రె్‌సలో కూడా మంటలు మొదటగా బాత్‌రూమ్‌ నుంచి మొదలయ్యాయని వివరించింది. బిహార్‌లోని ససారాంలో అగ్ని ప్రమాదం జరిగిన బోగీలో అసలు ప్రయాణికులే లేరని, అందులో పవర్‌ జనరేటర్‌ కూడా లేదని రైల్వే శాఖ తెలిపింది. బయట నుంచి దుండగుడు ఒక కాలే వస్తువును బోగీలోకి విసరడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగినవి కావని, కావాలనే చేశారని తెలిపింది. రైలు ప్రయాణం చేసేప్పుడు ప్రయాణికులు అనుమానం వస్తే వెంటనే 139కు కాల్‌ చేసి తెలియజేయాలని సూచించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 06:07 AM