Share News

విజయ్‌-రాహుల్‌ ఫొటో.. బ్లాక్‌ చేసిన ఇన్‌స్టా!

ABN , Publish Date - May 11 , 2026 | 06:45 AM

తమ అగ్రనేత రాహుల్‌గాంధీ, విజయ్‌తో దిగినఫొటోలను పోస్ట్‌ చేయగా ఇన్‌స్టాగ్రామ్‌ వాటిని బ్లాక్‌ చేసిందని ఆదివారం కాంగ్రెస్‌ ఆరోపించింది...

విజయ్‌-రాహుల్‌ ఫొటో.. బ్లాక్‌ చేసిన ఇన్‌స్టా!

న్యూఢిల్లీ, మే 10: తమ అగ్రనేత రాహుల్‌గాంధీ, విజయ్‌తో దిగినఫొటోలను పోస్ట్‌ చేయగా ఇన్‌స్టాగ్రామ్‌ వాటిని బ్లాక్‌ చేసిందని ఆదివారం కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిబంధనల కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంది. రాహుల్‌గాంధీ ఆదివారం చెన్నైలో విజయ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయనతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రాహుల్‌గాంధీ సహాయకుడు, కాంగ్రెస్‌ నేత శ్రీవత్స ఈ విషయమై ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌ రాహుల్‌, విజయ్‌ల ఫొటోలను బ్లాక్‌ చేసిందని పేర్కొన్నారు. ఐటీ శాఖ నిబంధనల కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. చాలాసేపు ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాహుల్‌ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ చాలాసేపు కనిపించలేదని ఆరోపించారు. దేశంలో ప్రతిపక్ష నేతల గళాన్ని అణచివేసే తీరే ఇది అని శ్రీవత్స పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ తిరస్కరించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 07:31 AM