16 నుంచి అమెరికా పర్యటనకు రాహుల్
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:45 AM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెలలో మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు
న్యూఢిల్లీ, నవంబరు 6: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెలలో మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఈ నెల 17న, మరుసటిరోజు చికాగో యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 19కి ఆయన తిరిగి భారత్‌కు చేరుకుంటారు. రాహుల్ ఇటీవలే వియత్నాం, థాయ్‌లాండ్‌లలో పర్యటించారు. కాగా 2023 నుంచి ప్రతి ఏడాది ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.