Share News

మలేషియా పీఎంతో రాహుల్, ప్రియాంక బ్రేక్ ఫాస్ట్ భేటీ

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:06 PM

న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మలేషియా పీఎంతో రాహుల్, ప్రియాంక బ్రేక్ ఫాస్ట్ భేటీ
Rahul And Priyanka Meets Malaysian PM Anwar Ibrahim at BRICS Summit

ఢిల్లీ, సెప్టెంబర్ 13: 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ (ఆదివారం) ఉదయం ఢిల్లీలోని ఒక హోటల్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇచ్చిన ప్రత్యేక అల్పాహార విందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.


ఈ భేటీ సందర్భంగా భారత్-మలేషియా సంబంధాలు, ఇరు దేశాల మధ్య దౌత్య బంధాలు, అంతర్జాతీయ/ప్రాంతీయ పరిణామాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం మలేషియా ప్రధాని సామాజిక మాధ్యమం 'X' వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీని తన 'మంచి మిత్రుడు' అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవడానికి ఈ సమావేశం చక్కని వేదికైందని తెలిపారు.


ఈ సమావేశానికి ఒక రోజు ముందే (శనివారం), ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మలేషియా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ భేటీలో సెమీకండక్టర్లు, రక్షణ, వర్తకం, మౌలిక వసతులు, ఎనర్జీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఒప్పందాలు కుదిరాయి.


బ్రిక్స్ కూటమిలో 'పార్టనర్ కంట్రీ' (భాగస్వామ్య దేశం) గా మలేషియా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పాటు, ఆసియాన్ (ASEAN) ప్రాంతంలో భారత్‌కు అత్యంత కీలకమైన భాగస్వామిగా కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

Updated Date - Sep 13 , 2026 | 04:06 PM