Share News

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

ABN , Publish Date - Sep 13 , 2026 | 02:16 PM

క్రికెట్ బంతి ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నాలుగు రోజులుగా ఓ తల్లిని నదీ తీరంలో కనీళ్లతో నిరీక్షించేలా చేసింది.

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ
Momin missing boy

ఇంటర్నెట్ డెస్క్: 'తిరిగి రా మోమిన్' అంటూ ఓ తల్లి నాలుగు రోజులుగా జమ్మూ కశ్మీర్‌లోని నల్లా మధుమతి నదీ తీరం వద్ద నిరీక్షిస్తున్నారు. తన కొడుకు కోసం ఆవేదనతో నదివైపే చూస్తున్నారు.


ఈ నెల 10న(గురువారం) మోమిన్ అనే ఓ పదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే సమీపంలోని నదిపై తేలుతున్న ఓ క్రికెట్ బంతి అతడికి కనిపించింది. దాని కోసం ఆ బాలుడు నదిలోకి దిగాడు. బంతిని తీసుకుని స్నేహితులపై విసిరాడు. తిరిగొచ్చే ప్రయత్నంలో కాలుజారి ఆ నదిలో పడిపోయాడు. అక్కడే ఉన్న అతడి సోదరి ఇదంతా చూస్తూ.. ఆ బాలుణ్ని తిరిగి రమ్మని బిగ్గరగా అరిచింది. కానీ అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి మోమిన్ ఆచూకీ తెలియరాలేదు.


విషయం తెలుసుకున్న అతడి తల్లి షాహీనా గుండెలవిసేలా రోదించారు. తన కొడుకును కోసం రోజూ ఆ నది ఒడ్డుకు వెళ్లి కూర్చుంటున్నారు. తనకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా గల్లంతయ్యాడని లబోదిబోమంటున్నారు. చివరిసారైనా అతణ్ని చూడాలని తెగ ఆవేదన చెందుతున్నారు. కుమారుడు వస్తాడన్న ఆశకు, తిరిగి రాలేడన్న నిజానికి మధ్య ఆమె గుండె తరుక్కుపోతోంది. రోజూ ఆమె నది వద్దకు రావడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది.

గల్లంతైన మోమిన్ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతడి జాడ ఇప్పటివరకూ తెలయలేదు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగినా బాలుడి ఆచుకీ లభించలేదు. దగ్గరలోని జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి ఒకేసారి నీళ్లు వదలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక్క క్రికెట్ బంతి ఇలా ఓ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

Momin Family.jpg


Momin Ashiq_File.jpeg


ఇవీ చదవండి:

తల్లి అంత్యక్రియల కోసం చిన్మయ్‌ కృష్ణదాస్‌కు కేవలం 5గంటల పెరోల్‌

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Updated Date - Sep 13 , 2026 | 02:36 PM