మోదీ, అమిత్‌షాలు ద్రోహులు
ABN , Publish Date - May 21 , 2026 | 05:48 AM
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలపై విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజనాలను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టిన ద్రోహులంటూ...
రాయ్‌బరేలీ సభలో రాహుల్
రాయ్‌బరేలీ, మే 20: ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలపై విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజనాలను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టిన ద్రోహులంటూ వారిద్దరినీ తీవ్ర పదజాలంతో విమర్శించారు. సొంత నియోజకవర్గం అయిన యూపీలోని రాయ్‌బరేలీలో వరుసగా రెండోరోజు ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. స్థానిక విప్లవ సంస్కర్త వీర్ పాసీ సంస్మరణలో ఏర్పాటుచేసిన బహుజన స్వాభిమాన్ సభలో రాహుల్ మాట్లాడుతూ..‘‘మోదీ, అమిత్‌షా, ఆర్‌ఎ్‌సఎ్‌సకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడండి. వారిద్దరి గురించి చెప్పడానికి మీ ఇంటికి వచ్చే ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలను నిలదీయండి. ‘మీరు, మీతోపాటు ఆ ఇద్దరే దేశ ద్రోహులు’ అని వారి ముఖం మీదే చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా చమురు వినియోగం తగ్గించుకోవాలని మోదీ పొదుపు చర్యలు సూచించారన్నారు. కానీ, అంబానీ మాత్రం తన చమురును బయట దేశాలకు ఎగుమతి చేస్తూ..ఆ వచ్చిన డబ్బును ఫండ్‌గా మోదీకి ఇస్తున్నారని రాహుల్ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ కష్టాల నుంచి దేశంలో చమురు సంక్షోభం వరకు.. ప్రతి దానికీ మోదీ, అమిత్‌షా, ఆర్‌ఎ్‌సఎ్‌సలదే బాధ్యత అని విమర్శించారు. దేశాన్ని భయంకరమైన ఆర్థిక సంక్షోభం ముంచెత్తనున్నదని రాహుల్ మరోసారి హెచ్చరించారు. అంబేడ్కర్, గాంధీజీ, వీర్ పాసీల సిద్ధాంతాలను పరిరక్షించడమే వారి స్మృతికి నిజమైన నివాళి అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు