ఏదైనా అడగండి.. చెప్తా..!
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:02 AM
జెన్‌జీలకు చేరువ కావటమే లక్ష్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు...
ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌గాంధీ కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ/ప్రయాగ్‌రాజ్, ఆగస్టు 6: జెన్‌జీలకు చేరువ కావటమే లక్ష్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం రాత్రి నిర్వహించిన ప్రత్యక్ష (లైవ్) కార్యక్రమంలో యువత అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్‌గాంధీ సమాధానాలిచ్చారు. జార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటంపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. దేశం లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలన్నీ ప్రస్తుత విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్నవే నని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, జార్ఖండ్‌లోని జేఎంఎం ప్రభుత్వమైనా విద్యార్థులు చెప్తున్నది వినాల్సిందేనని స్పష్టంచేశారు. రాంచీలో దీక్ష చేస్తున్న విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. మన సమాజంలో ప్రస్తుతం మహిళలను చూస్తున్న తీరును తాను ఏమాత్రం సమర్థించటం లేదని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమాన హక్కులు, ప్రాతినిధ్యం లభించాలని తెలిపారు. ప్రస్తుతం మన విద్యావ్యవస్థ మేధావులను నాశనం చేస్తోందని విమర్శించారు.
విద్యార్థులతో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ
రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులతో శనివారం నిర్వహించాలనుకున్న ఛాత్రోంకీ గూంజ్ సభకు కాయస్థ పాఠశాల ట్రస్టు ఇప్పటికే ఇచ్చిన అనుమతిని వెనక్కితీసుకుంది. విద్య, క్రీడలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇవ్వరాదన్న అలహాబాద్‌కోర్టు ఆదేశాల మేరకు కేపీ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేకపోతున్నామని ట్రస్టు స్పష్టం చేసింది. విద్యార్థుల గోడు వింటానంటేనే యూపీ ప్రభుత్వం బెదిరిపోతోందని రాహుల్ విమర్శించారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News