Share News

అది అంటరానితనానికి మరో రూపం.. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం..

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:51 PM

ఉత్తరాఖండ్ ‘శుద్ధీకరణ’ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. భారతీయ జనతాపార్టీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది అంటరానితనానికి మరో రూపం.. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం..
Rahul Gandhi

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ ‘శుద్ధీకరణ’ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. భారతీయ జనతాపార్టీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో అస్పృశ్యతను చట్టబద్ధంగా నిషేధించారని, మల్లికార్జున ఖర్గే దళితుడనే కారణంతో ఇలా మైదానాన్ని శుద్ధి చేయడం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని రాహుల్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..


‘శుద్ధీకరణ’ సమాజంలో ఇంకా బతికే ఉన్న అంటరానితనానికి మరో పేరని ఆయన వ్యాఖ్యానించారు. శుద్ధీకరణ పూజను నిర్వహించిన వారిపై, దీనికి మద్దతు ఇచ్చిన ఉత్తరాఖండ్ స్థానిక బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులు సమాజంలో ఎదగడం, గౌరవంగా బతకడం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు ఇష్టం లేదని, ఈ ఘటన వారి కులవివక్ష భావజాలాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆగస్టు 8వ తేదీన హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఖర్గే ర్యాలీ ముగిసిన రెండు రోజుల తర్వాత 'శ్రీరామ్ సేన' అనే స్థానిక సంస్థ ఆ మైదానంలో గంగాజలం చల్లి, హవనం (పూజ) నిర్వహించి మైదానాన్ని ‘శుద్ధి’ చేసింది. దీంతో వివాదం మొదలైంది.


ఇవి కూడా చదవండి

అది అంటరానితనానికి మరో రూపం.. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం..

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి

Updated Date - Aug 29 , 2026 | 03:57 PM