Share News

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం.. రాహుల్ గాంధీ ధ్వజం

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:35 PM

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం.. రాహుల్ గాంధీ ధ్వజం
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్యా రంగంలో నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం..

విద్య అనేది దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్న రాహుల్ గాంధీ.. ప్రస్తుత విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యా రంగంలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే బాధ్యత వహించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నంత కాలం విద్యా వ్యవస్థలో మార్పులు సాధ్యం కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

జనసేనకు పత్రికలు, ఛానళ్లు లేవు.. కార్యకర్తలే మీడియా: మంత్రి నాదెండ్ల మనోహర్

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 04:59 PM