Share News

మోదీ సర్కార్‌లోని 200 మంది అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:52 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చెందిన 200 మంది అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మోదీ సర్కార్‌లోని 200 మంది అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చెందిన 200 మంది అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమకు సమాచారం అందిస్తున్న అధికారులు ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖలో పని చేస్తున్నారని రాహుల్ తెలిపారు. వారందరూ ఎన్నికల సంఘం అక్రమాలపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే తమకు సహకరిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు (Rahul Gandhi about Government Officials).


ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. 'ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీజేఐకి చెప్పాలనుకున్నాం. అందుకే ఆయన అపాయింట్‌మెంట్ కోరాం. మా విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. మేం ఎక్కడికి వెళ్లాలనుకున్నా పోలీసులు అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సీజేఐ అన్నారు. అందుకే ఇవాళ సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేవారు మాతో కలిసిరండి' అని రాహుల్ పిలుపునిచ్చారు (200 Officials in Touch).


ప్రజలందరూ ఓ వైపు ఉంటే, ప్రధాని మోదీ, అమిత్‌ షా, జ్ఞానేష్‌ కుమార్ మరో వైపు ఉన్నారని రాహుల్ అన్నారు. తప్పుచేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇండియా బ్లాక్ లేదా సీజేపీ ఎవరు నిరసన తెలిపినా.. అందరి లక్ష్యం ఒకటేనని రాహుల్ పేర్కొన్నారు. పౌర సమాజ సంస్థలు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ ఉద్యమంలో తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!


స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 12 , 2026 | 01:56 PM