Share News

ఆ సంస్థకే మళ్లీ కాంట్రాక్టా?

ABN , Publish Date - May 28 , 2026 | 06:05 AM

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టిన సీబీఎ్‌సఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎ్‌సఎమ్‌) మూల్యాంకనం గందరగోళం వెనుక భారీ కుట్ర దాగి ఉందని...

ఆ సంస్థకే మళ్లీ కాంట్రాక్టా?

  • ఈ వ్యవహారం వెనక భారీ స్కాం

  • ప్రధాని నోరు ఎందుకు విప్పడం లేదు: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 27: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టిన సీబీఎ్‌సఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎ్‌సఎమ్‌) మూల్యాంకనం గందరగోళం వెనుక భారీ కుట్ర దాగి ఉందని బుధవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్‌ దర్యాప్తు జరిపించడంతో పాటు స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీబీఎ్‌సఈ పరీక్ష పేపర్లు దిద్దే కాంట్రాక్ట్‌ దక్కించుకున్న గ్లోబరీనా కంపెనీ నేపథ్యంపై రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఈ సంస్థ చేసిన ఓఎ్‌సఎమ్‌ ప్రక్రియ లోపాల వల్లే 23మంది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. ఈ వివాదాస్పద కంపెనీ చేతుల్లో.. 17లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును సీబీఎ్‌సఈ ఎలా పెట్టిందని నిలదీశారు. ఈ సంస్థ ‘కోఎంప్ట్‌’ అని పేరు మార్చుకుని వచ్చినా.. దాని పాత చరిత్ర తెలుసుకోవడానికి తమకు 30సెకన్ల సమయం పట్టిందని.. మరి సీబీఎ్‌సఈ బోర్డుకు, కేంద్రానికి ఆ కంపెనీ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. బ్లాక్‌లిస్ట్టెడ్‌లో ఉన్న సంస్థకు కావాలనే కాంట్రాక్ట్‌ కట్టబెట్టారని రాహుల్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి.. ప్రధాని మోదీ ఎప్పటిలాగే జవాబుదారీతనం లేకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అసలు ఈ కోఎంప్ట్‌ సంస్థకు ఎవరి సిఫారసులపై కాంట్రాక్టు ఇచ్చారని.. సంస్థ యాజమాన్యానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. పరీక్షల లీకేజీలు, మూల్యాంకాన లోపాలను అరికట్టడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటన మరవకముందే, ఇప్పుడు సీబీఎ్‌సఈ జవాబుపత్రాలు తారుమారు చేయడం.. విద్యార్థుల శ్రమను దొంగిలించడమేనని ఆరోపించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:05 AM