Share News

యూపీ ఎన్నికల్లో ఎస్పీతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:34 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో సమాజవాదీ పార్టీ (ఎస్పీ)తో సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

 యూపీ ఎన్నికల్లో ఎస్పీతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, నవంబర్16: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో సమాజవాదీ పార్టీ (ఎస్పీ)తో సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్పీతో సీట్ల సర్దుబాటు అంశానికి ఎంపీ ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సోమవారం న్యూఢిల్లీలో అగ్రనేతలతో యూపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుతోపాటు పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. కూటమి భాగస్వామ్యంపై మీడియాలో ఎటువంటి ప్రకటనలు చేయవద్దని ఈ సందర్భంగా యూపీ పీసీసీ చీఫ్, యూపీ పార్టీ వ్యవహారాల బాధ్యుడికి అగ్రనేతలు స్పష్టం చేశారు.


మార్పు కోరుకుంటున్న యూపీ ప్రజలు: ఖర్గే

రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాల హక్కులకు మరింత బలమైన రక్షణ కావాలని ఆకాంక్షించారు. యూపీ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితితోపాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై లోతైన చర్చ జరిపానని వివరించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఖర్గే పేర్కొన్నారు.


2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల వలే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇండియా కూటమి గద్దె దించుతుందని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తెలిపారు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ ప్రజలకు తెలుసునని అన్నారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీని వీలైనంత త్వరగా గద్దె దించాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయ భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని కె.సి.వేణుగోపాలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ 37 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ 33 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉదయం నడక, సాయంత్రం నడక.. వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు..?

జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..

Updated Date - Nov 16 , 2026 | 07:42 PM